
సికింద్రాబాద్, వెలుగు : విహార యాత్రలు, పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శ్రావణ మాసంలో అత్యధికంగా పెండ్లిళ్లు ఉన్నందున ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని రాణిగంజ్ డిపో మేనేజర్ లక్ష్మి ధర్మ సూచించారు.
ప్రైవేటు వెహికల్స్ కన్నా తక్కువ కిరాయికి ఆర్టీసీ బస్సులను ఇస్తామని, డ్రైవర్‌కు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు.