ఆర్టీసీలో అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు అప్లై చేసుకోండి

ఆర్టీసీలో అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు అప్లై చేసుకోండి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీసీ సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిక్షణ కోసం అప్లై చేసుకోవాలని రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుచరిత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2023, 2024, 2025, 2026 సంవత్సరాల్లో ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసినవారు అర్హలన్నారు.  సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూబ్లీ బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 28, 29 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. 

అభ్యర్థులు ముందుగా https://nats.education.gov.in/regular_student.php వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని, ఎస్సెస్సీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెమోలు, ప్రొవిజనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్, ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్​పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదటి పేజీ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏటీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాపీతో హాజరుకావాలని సూచించారు.