ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి..!

ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి..!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బస్టాండ్ లో దారుణం జరిగింది. బస్సు ఎందుకు లేట్ వచ్చిందన్న ప్రయాణికుడిని ఆర్టీసీ సిబ్బంది చితకబాదారు. వివరాల్లోకి వెళ్తే షాదనగర్ బస్ స్టాండ్ లో హైదరాబాద్ వెళ్లే బస్సులు రాకపోవడంతో విచారణ అధికారిని హైదరాబాద్ కు వెళ్లే బస్సు ఎప్పుడు వస్తుందని అడిగాడు సదరు ప్రయాణికుడు. అది కాస్త ఇద్దరి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది.

 ఆర్టీసీ  డ్రైవర్లు ప్రయాణికుడిని చితకబాదే వరకు వెళ్ళింది. సదరు ప్రయాణికుడు హైదరాబాద్ బస్సులు గంట నుంచి రావడం లేదు, టైమింగ్ ఏమైనా చేంజ్ అయిందా? ఏ టైం కి వస్తాయని అడిగినందుకు బస్సు డ్రైవర్ అతన్ని ఇంత హీనంగా చితకబదాడని తోటి ప్రయాణికులు చెప్పారు. ఇంత దౌర్జన్యమా ఇదేం పద్ధతి అంటూ తోటి ప్రయాణికులు మండిపడుతున్నారు. 

ఈ మొత్తం ఘటనను కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇంకేముంది క్షణాల్లోనే వైరల్ గా మారింది. దాడి చేసిన ఆర్టీసీ సిబ్బందిపై ట్రోల్స్ కు దారి తీసింది.