మెట్రోలో జనమే జనం : ఒక్కరోజే 3.50 లక్షల మంది ప్రయాణం

మెట్రోలో జనమే జనం : ఒక్కరోజే 3.50 లక్షల మంది ప్రయాణం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో కు తాకిడి పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే 3 లక్షల 50 మంది ప్రయాణించారు. బస్సుల కొరత , ప్రైవేట్ వాహనాల దోపిడీ అధికం కావటంతో జనం మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దసరా, బతుకమ్మ పండగలకు ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి రావటంతో రష్ మరింత పెరిగింది. హెటెక్ సిటీ, అమీర్ పేట, ఎల్బీనగర్ వంటి ప్రధాన స్టేషన్లలో రద్దీ ఎక్కువగా కనిపించింది. రద్దీ పెరుగుతుందన్న అంచనా తో అదనపు ఏర్పాట్లు చేశామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ నుంటి హైటెక్ సిటీకి, ఎల్.బీ నగర్ నుంచి హైటెక్ సిటీకి రద్దీ విపరీతంగా ఉంది. ఆర్టీసీ సమ్మె కొనసాగినన్ని రోజులు అదనపు సర్వీసులు నడిపిస్తామని తెలిపారు.