ఊరెళ్లని పట్నం: బతుకమ్మ, దసరాపై ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌‌‌‌

ఊరెళ్లని పట్నం: బతుకమ్మ, దసరాపై ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌‌‌‌

బతుకమ్మ, దసరాపై ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌‌‌‌
ఇబ్బంది పడుతూ వెళ్లడం కన్నా ఉండటమే బెటరని..
జర్నీలు మానుకున్న లక్షలాది మంది జనం


హైదరాబాద్‌‌‌‌, వెలుగు:బతుకమ్మ, దసరా పండుగలు వచ్చాయంటే పల్లె బాట పట్టే పట్నంవాసులు ఈసారి మాత్రం వెళ్లలేకపోయారు. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌‌‌‌తో లక్షలాది మంది తమ ప్రయాణాలు మానుకున్నారు. బస్సులు పూర్తి స్థాయిలో నడవకపోవడం, ప్రైవేట్‌‌‌‌లో మస్తు చార్జీలు వసూలు చేస్తుండటంతో భారం భరించలేక జర్నీలు క్యాన్సల్‌‌‌‌ చేసుకున్నారు. అంత ఖర్చులు పెడితే ఇక్కడే పండుగను మంచిగా చేసుకోవచ్చనుకుని ఆగిపోయారు. అందుకే పండుగలొస్తే బోసిపోయే నగర రోడ్లు ఈసారి కిటకిటలాడుతున్నాయి. సోమవారం రోడ్లన్నీ రద్దీగా కనిపించాయి.

అంత ఖర్చు పెట్టుడెందుకని..

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. 4న సాయంత్రం నుంచే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపేశారు. దీంతో ప్రతిసారి పల్లెకు వెళ్లి సద్దుల బతుకమ్మ, దసరా జరుపుకునే ప్రజల్లో సగం మంది ఈసారి హైదరాబాద్‌‌‌‌కే పరిమితమయ్యారు. బస్సులు నడవకపోవడం, ప్రైవేట్‌‌‌‌ వాహనాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తుండటం, రైళ్లు కిక్కిరిసి ఉండటంతో లక్షలాది మంది చిరుద్యోగులు, కూలీలు ప్రయాణాలు మానుకున్నారు.

బస్సులు ఉండుం టే వెళ్లే వాళ్లం
పదేళ్లుగా హైదరాబాద్‌ లో జాబ్‌ చేస్తున్నా. మా ఊరు ఇక్కడి నుంచి 170 కిలోమీటర్లు. బతుకమ్మ పండుగకు భార్య, పిల్లలను ఊరికి పంపి దసరాకు నేను వెళ్లేవాడిని. ఈసారి ఆర్టీసీ సమ్మె ఉంది కదా. పిల్లలను వెంటబెట్టు కొని వెళ్లడం, రావడం ఇబ్బందని ఈ సారికి ఇక్కడే ఉండాలనుకున్నాం. – బుర్రి రమేశ్‌, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి, పెద్దముప్పారం, మహబూబాబాద్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌