
ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపిన హైకోర్టు… గతంలో సర్కార్ ధాఖలు చేసిన కౌంటర్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. సమ్మెపై అటు ఆర్టీసీ సంఘాల జేఏసీ, ఇటు ప్రభుత్వం మరోసారి పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయనున్నాయి ఆర్టీసీ జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఆత్మహత్యలపై కార్మిక సంఘాలు కూడా హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నాయి.