
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మె జరుగుతోందనే సాకుతో ఈ నెల ఒకటో తేదీ నుంచి దివ్యాంగులు, ఫ్రీడం ఫైటర్ల బస్‌పాస్‌లను రెన్యూవల్ చేయడం ఆపేసిన అధికారులు.. గురువారం నుంచి ప్రారంభించారు. ‘ఫ్రీ బస్ పాస్‌లు రెన్యూవల్ చేస్తలేరు’ అనే శీర్షికన మంగళవారం ‘వెలుగు’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆర్టీసీ అధికారులు బస్‌పాస్‌లు రెన్యూవల్ చేయాలని కౌంటర్ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో గురువారం నుంచి దివ్యాంగులు, ఫ్రీడం ఫైటర్లు తమ పాస్‌లు రెన్యూవల్ చేసుకున్నారు. రాష్ట్రంలో 5.6 లక్షల దివ్యాంగుల బస్‌పాసులు, ఐదు వేల వరకు ఫ్రీడమ్ ఫైటర్ల బస్‌పాసులు ఉన్నాయి. వాటిని ఏటా రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగుల బస్ పాసులు ప్రతినెలా సుమారు 45 వేల వరకు రెన్యూవల్ అవుతుంటాయి.