బకాయిల విడుదలపై ఆర్టీసీ సంఘాల హర్షం

బకాయిల విడుదలపై ఆర్టీసీ సంఘాల హర్షం

హైదరాబాద్, వెలుగు: మహాలక్ష్మి స్కీమ్ కు సబ్సిడీ నిధులు రూ.374 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం విడుదల చేయడంపై ఆర్టీసీ యూనియన్లు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపాయి. స్కీమ్ స్టార్ట్ చేసిన 5 రోజుల్లోనే నిధులు విడుదల చేయడం ఆర్టీసీపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుపుతుందని టీఎంయూ ఫౌండర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో యూనియన్లను స్టార్ట్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. సబ్సిడీ డబ్బులను వెంటనే ఆర్టీసీకి ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని ఎన్​ఎంయూ అధ్యక్షుడు కమాల్ రెడ్డి, చైర్మన్ చెన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ తెలిపారు. ఆర్టీసీ బలోపేతానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహాలక్ష్మి స్కీమ్ కి సబ్సిడీ నిధులు విడుదల చేయడంపై టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులను సీసీఎస్ బకాయిలు చెల్లింపునకు వినియోగించాలని ఆర్టీసీ మేనేజ్​మెంట్​కు విజ్ఞప్తి చేశారు.