హనుమకొండ సిటీ/ జయశంకర్భూపాలపల్లి/ హసన్‌పర్తి, వెలుగు: ఆర్టీసీ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజాప్రతినిధులు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్మికులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నిర్వహించారు.
హనుమకొండ బస్‌డిపో వద్ద మహిళా కాంగ్రెస్‌జిల్లా అధ్యక్షురాలు బంక సరళ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయగా, హసన్‌పర్తి మండల కేంద్రంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్‌డిపో, అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.

