
హైదరాబాద్, వెలుగు: దగ్లు, జలుబు వంటి లక్షణాలున్న ఇన్ప్లూయెంజా బాధితులకు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు శ్వాస సమస్యలున్నోళ్ల శాంపిళ్లను సేకరించి ఆర్టీపీసీఆర్ విధానంలో నిర్ధారించాలని పబ్లిక్‌హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖాన్లు, ఏరియా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులకు ఈ లక్షణాలతో ఓపీకి వస్తే కరోనా టెస్టు చేయాల్సిందేనన్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్నోళ్లలో 2 శాతం మంది నుంచి శాంపిల్స్ తీసి ఆర్టీపీసీఆర్ చేయాలన్నారు. ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి కరోనా లక్షణాలు ఉన్నోళ్లందరినీ టెస్టులకు పంపాలన్నారు.