సర్కార్​ సెంటర్లలో అందుబాటులోలేని ఆర్టీపీసీఆర్ టెస్టులు 

సర్కార్​ సెంటర్లలో అందుబాటులోలేని ఆర్టీపీసీఆర్ టెస్టులు 
  • యాంటిజెన్​ టెస్టులనే చేస్తున్న అధికారులు  
  • ప్రైవేటులో చేయించుకుంటే వందల్లో బిల్లు

హైదరాబాద్, వెలుగు: సిటీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.  సింటమ్స్​ఉన్నవారు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సర్కార్ సెంటర్లలో  కేవలం యాంటిజెన్​టెస్టులు మాత్రమే చేస్తుండగా,  సరైన రిజల్ట్​రావడం లేదు.  ఆర్టీపీసీఆర్( రివర్స్​ట్రాన్స్ క్రిప్షన్​ పాలిమరైజ్​ చైన్ ​రియాక్షన్​) టెస్టులు చేసుకుందామంటే అందుబాటులో లేవు. ఉన్నచోట టెస్టులు చేసుకోలేని పరిస్థితి ఉంది. గతేడాది ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం సెంటర్లతో పాటు ప్రత్యేకంగా బస్సు లు అందు బాటులో ఉంచారు.  ప్రస్తుతం గాంధీ, కింగ్ కోఠి, ఐపీఎం సెంటర్, ఫీవర్, టిమ్స్​హాస్పిటల్స్​లోనే  టెస్టులు చేయించుకునే వీలుంది. గాంధీ, టిమ్స్, ఫీవర్ దవాఖానల్లో కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. దీంతో అక్కడకు వెళ్లేందుకు జనాలు ఇంట్రెస్ట్​ చూపడంలేదు.  ప్రైవేట్​ల్యాబ్​ల్లోనైతే రూ. 500 లు అవుతాయి. ఆర్థిక స్తోమత ఉన్నవారు చేయించుకుంటుంటే, పేదలు మాత్రం తక్కువ ఖర్చు అయ్యే యాంటిజెన్​టెస్టులనే చేయించుకుంటున్నారు. ఈ టెస్టుతో పూర్తి రిజల్ట్​ తెలియడం లేదని, సింటమ్స్​ఉండి యాంటిజెన్​లో నెగటివ్ వచ్చిన వారికి కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ప్రభుత్వం చెబుతుండగా అందుకు సెంటర్లు అందుబాటులో లేవు. 70 శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులనే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. 
రెండు నెలలు తిరిగిన బస్సులు ఏమైనయ్
గతేడాది మే, జూన్​ నెలల్లో అత్యధికంగా కేసులు రావడంతో అప్పట్లో స్పెషల్​ గా బస్సులను ఏర్పా టు చేసి ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్స్​కలెక్ట్​ చేశారు. ఒక్కో బస్సు డైలీ వేయి మందికి టెస్టులు చేసేలా అన్ని ఏర్పాట్లు ఉండేవి. గ్రేటర్ పరిధిలో 50 కిపైగా బస్సులను తిప్పారు. బస్తీలు, కాలనీలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో  బస్సులు తిరుగుతూ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశాయి.  సర్కార్​ హాస్పిటల్స్​లో సరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయకపోతుండగా బస్సుల వద్దకు వచ్చి వేలాది మంది టెస్టులు చేయించుకునేవారు.  రెండు నెలల పాటు తిరిగిన బస్సులు ఆ తర్వాత కనిపించలేదు. అవి ఉండి ఉంటే ఇప్పుడు ఉపయోగంగా ఉండేవి.