
- తిల ఆయలంలో నిర్వహించిన పూజార్లు
అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమైన సందర్భంగా బుధవారం ఉదయం శివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. కుబేర్ తిల ఆలయంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంతి నృత్య గోపాల్ దాస్ అధికార ప్రతినిధి కమల్ నయన్ దాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 25 మంది పూజార్లు ఈ అభిషేకంలో పాల్గొన్నారు. గుడి నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడాలని ఆ శివున్ని కోరుతూ ఈ రుద్రాభిషేకం నిర్వహించామని వారు అన్నారు. ప్రస్తుతం ఆలయానికి సంబంధించి ప్రాథమిక పనులు స్టార్ట్ అవుతాయని, మెయిన్ వర్క్ మొదలయ్యేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు.