రుద్రపట్నం టీడీపీలో రగిలిన నిరసన జ్వాల.. జెండాలు దగ్ధం, కుర్చీలు ధ్వంసం..

రుద్రపట్నం టీడీపీలో రగిలిన నిరసన జ్వాల.. జెండాలు దగ్ధం, కుర్చీలు ధ్వంసం..

2024 ఎన్నికల్లో జగన్ ను ఎలా అయినా గద్దె దించి అధికారంలోకి రావటమే లక్ష్యంగా జనసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీలో అసమ్మతి సెగ తీవ్రస్థాయిలో తగులుతోంది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనలకు టికెట్ కేటాయించిన స్థానాల్లో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.తాజాగా అనంతపురం జిల్లా రుద్రపట్నంలో నిరసన జ్వాల రాజుకుంది. ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించకపోవటంతో ఆయన అనుచరులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.

జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన కార్యకర్తలు టీడీపీ జెండాలకు, ఫ్లెక్సీలకు నిప్పంటించారు, పార్టీ ఆఫీస్ బిల్డింగ్ లోని కుర్చీలను కూడా ధ్వంసం చేశారు. చంద్రబాబు డబ్బుకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. ఈ క్రమంలో తన అనుచరులతో చర్చించిన తర్వాత తన తదుపరి కార్యాచరణ తెలియజేస్తానని ప్రభాకర్ చౌదరి తెలిపారు. మరి, ప్రభాకర్ చౌదరి పార్టీ మారతారా లేక ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా అన్నది వేచి చూడాలి.