హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రగ్బీ ప్రీమియర్ లీగ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రగ్బీ ప్రీమియర్ లీగ్

న్యూఢిల్లీ: మరో ప్రతిష్ఠాత్మక స్పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎల్) రెండో సీజన్ జూన్ 16 నుంచి 28 వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. రగ్బీ ఇండియాతో కలిసి జీఎంఆర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. 

వేగవంతమైన ‘రగ్బీ సెవెన్స్’ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాగే ఈ పోటీల కోసం తెలంగాణ ప్రభుత్వంతో జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది.  గత సీజన్ కంటే ఈసారి పోటీలను మరింత గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిర్వహిస్తామని రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ తెలిపారు.