
ఎక్కువగా జర్నీలు చేసే టెకీలు ఎక్కడుంటే అక్కడి నుంచే వర్క్ చేస్తుంటారు. అందుకే వాళ్లతోపాటే ల్యాప్‌టాప్, కీబోర్డ్, మౌస్ లాంటివి తీసుకెళ్తుంటారు. అలాంటివాళ్ల కోసం తీసుకొచ్చిన పర్ఫెక్ట్ కీబోర్డ్ ఇది. రుహ్జా అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ కీబోర్డ్‌ని చుట్టలా చుట్టి బ్యాగ్‌లో వేసుకోవచ్చు. దీనిమీద టైపింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి సౌండ్ రాదు. దానివల్ల ముఖ్యంగా రాత్రి సమయంలో చుట్టుపక్కల వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సిలికాన్‌తో తయారుచేసిన ఈ కీబోర్డ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. పైగా చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. దీన్ని తడి బట్టతో, లేదంటే ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్‌తో క్లీన్ చేసుకోవచ్చు. దీని ధర రూ.1,249.
ఈ కీబోర్డ్‌ని గుండ్రంగా చుట్టి బ్యాగ్‌లో వేసుకోవచ్చు.. టెకీలకి పర్ఫెక్ట్..