V6 News

ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రుక్మిణీ రీప్లేస్

ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రుక్మిణీ  రీప్లేస్

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక బయోపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ మార్పు జరిగిందనే వార్తలు హాట్ టాపిక్‌‌గా మారాయి.  మొదట ఈ బయోపిక్‌‌లో సాయి పల్లవిని సెలెక్ట్ చేశారు. ఆమె నటన, క్లాసికల్ లుక్ ఈ పాత్రకు బాగా సరిపోతుందని మేకర్స్ భావించారు.

అయితే వరుస సినిమాలతో ఆమెకున్న కమిట్‌‌మెంట్స్, లేదంటే ఇతర కారణాలతో సాయిపల్లవి  ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె స్థానంలోకి  కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్‌‌ను రీప్లేస్ చేశారని ప్రచారం జరుగుతోంది. రుక్మిణీ  ప్రస్తుతం టాక్సిక్, డ్రాగన్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో హీరోయిన్‌‌గా నటిస్తోంది.

‘టాక్సిక్’ విడుదలకు సిద్ధమవగా, ‘డ్రాగన్’ షూటింగ్‌‌లో ఆమె బిజీగా ఉంది. అలాగే ధనుష్‌‌తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌‌లో ఆమె నటించనుందనే వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ టీమ్‌‌ నుంచి  అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ బయోపిక్‌‌ను ‘జెర్సీ’ ఫేమ్  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం ప్రీ  ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  త్వరలో షూటింగ్  ప్రారంభం కానుంది.