ఎన్విడియా సీఈవోగా మళ్లీ హువాంగ్.. 11 రోజుల్లోనే జెన్సన్ రీఎంట్రీ!

ఎన్విడియా సీఈవోగా మళ్లీ హువాంగ్..  11 రోజుల్లోనే జెన్సన్ రీఎంట్రీ!
  • భద్రతకు ముప్పు లేదన్న అమెరికా సర్కారు! 
  • విదేశీ నిఘా వ్యవహారంపై దర్యాప్తు యథాతథం
  • ఎగుమతుల నియంత్రణకు కొత్త కమిటీ
  • డిసెంబర్ 1, 2న హౌస్ కమిటీల ముందుకు

 

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : ఏఐ చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల తయారీ కంపెనీ  ఎన్విడియా బోర్డు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ పదవి నుంచి జెన్సెన్ హువాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలగించిన రెండు వారాల లోపే, ఆయన్ని తిరిగి నియమించింది. అమెరికా ప్రభుత్వం మద్దతు తెలపడంతో  బోర్డు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. హువాంగ్ రీఎంట్రీ వార్తలతో స్టాక్ మార్కెట్లో ఎన్విడియా షేర్లు ఏకంగా 34 శాతానికి పైగా ఎగిశాయి.   హువాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పలు దఫాలుగా చర్చించిన తర్వాత, కంపెనీని నడిపించడానికి ఆయనే సరైన వ్యక్తి అని బోర్డు చైర్మన్ హార్వే . జోన్స్ పేర్కొన్నారు. తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించిన కొలెట్ క్రెస్ తిరిగి సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓగా కొనసాగుతారు.

ఎన్విడియాకు తిరిగి నాయకత్వం వహించడం గౌరవంగా ఉందని హువాంగ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన తిరిగి సీఈఓగా తీసుకోవడం సరైన నిర్ణయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్వాగతించారు. జెన్సన్ హువాంగ్ చట్టవిరుద్ధమైన పనులు చేశారనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.   హువాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని విదేశీ గూఢచార సంస్థలు పనిచేశాయన్న ఆరోపణలపై స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ విచారణ కొనసాగుతుందని ఎన్విడియా తెలిపింది. అలాగే, అమెరికా ఎగుమతి నిబంధనలు ,  నేషనల్ సెక్యూరిటీ అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, కొత్తగా చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమిస్తున్నట్లు వెల్లడించింది.  సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 'మెగాస్పీడ్' సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ అలిస్ హువాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా పలువురితో జెన్సెన్​కు వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న వార్తలు  రావడం,  అలిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  చైనా గూఢచార సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈనెల 12న హువాంగ్​ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ట్రంప్ చైనా ట్రిప్ తర్వాత మార్పు 

"హువాంగ్​ సారీ చెప్పి, తిరిగి ఎన్విడియా  సీఈఓగా వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఆయన వల్లే అమెరికా ఇతర దేశాల కంటే 10 ఏళ్లు ముందుంది" అంటూ చైనా నుంచి వచ్చిన తర్వాత ట్రంప్ ఓపెన్‌‌గా మద్దతు పలికారు.   అంతకుముందు వరకు హువాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఎన్విడియా బోర్డు,  యూ-టర్న్ తీసుకోవాల్సి వచ్చింది.  చైనాకు ఎన్విడియా చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఎగుమతిపై హువాంగ్ మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నారు.
 

మరిన్ని వార్తలు