నిత్య మహమ్మారిలా ప్రాణాలు తీస్తున్న హార్ట్ అటాక్స్ నుంచి కాపాడుకోవాలంటే.. రోజూ అరగంట నడక, రన్నింగ్, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చాలు.. ఇవి డాక్టర్లు చెప్తున్న సూచనలు, జాగ్రత్తలు. గుండెను కాపాడుకునేందుకు చాలా మంది ఫాలో అవుతూ.. ఐ యామ్ సేఫ్.. అనుకుంటున్నారు. కానీ.. బెంగళూరులో ఒక యువకుడి ఇన్సిడెంట్ గురించి తెలుసుకుంటే.. డైలమాలో పడిపోతారు. ఇంత చేసినా గ్యారెంటీ లేదా.. మరి హార్ట్ ను కాపాడుకునే సొల్యుషన్ ఏంటనే ప్రశ్న మిమ్మల్ని తొలిచేయక మానదు.
అవును.. బెంగళూరుకు చెందిన కార్తీక్ శ్రీనివాసన్ అనే వ్యక్తి.. ఏంజియోప్లాస్టీ సర్జరీకి వెళ్లి.. రెండు స్టెంట్స్ పడ్డ తర్వాత.. అతను చెప్పిన స్టన్నింగ్ విషయాలు వింటే కొత్త భయం పుట్టుకురావడం ఖాయం. కార్తీక్ .. రోజు ఐదు కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాడు. టైమ్ కు నిద్రపోతాడు. చెత్త ఫుడ్డు జోలికి అస్సలు వెళ్లడు. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతుంటాడు. అయినా గుండెలో ఏదో నొప్పి మొదలైందని ఆస్పత్రికి వెళ్తే.. మీ గుండె సేఫ్ కాదని చెప్పి రెండు స్టెంట్స్ వేశారంట డాక్టర్లు.
కార్తీక్ స్టోరీ ఏం చెబుతోంది..?
హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయినప్పటికీ గుండె పోటు వచ్చే ప్రమాదముందని కార్తీక్ స్టోరీ ద్వారా అర్థమవుతోంది. 2011 నుంచి 2015 వరకు అతడి గుండె పరిస్థితి గురించి.. సర్జరీ గురించి చెప్పాడు. అన్నీ ఫాలో అయినప్పటికీ తనకు వచ్చిన పరిస్థితి గురించి చెప్పిన కార్తీక్.. ఈ తర్వాత తనలో వచ్చిన మార్పులు.. ఫాలో అవుతున్న టిప్స్ గురించి వివరించాడు.
సర్జరీ తర్వాత తన లైఫ్ సెకండ చాన్స్ అని చెబుతున్న కార్తీక్.. ఆ తర్వాత పూర్తిగా క్వాలిటీ లైఫ్ ఎలా జీవించాలో అర్థమైందని చెప్పాడు. 2018 నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నప్పటికీ.. క్రమక్రమంగా హ్యాబిట్స్ ను మార్చుకుని.. గుండెను స్ట్రాంగ్ గా ఉంచుకునేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలపై పూర్తి అవగాహనకు వచ్చినట్లు చెప్పాడు. గుండెను కాపాడుకునేందుకు తను ఫాలో అయిన కొన్ని టిప్స్ షేర్ చేశాడు. వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న కార్తీక్ డైలీ రొటీన్ లో వచ్చిన మార్పులు.. వాటి వెనుక ఉన్న టిప్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
సర్జరీ తర్వాత మెల్ల మెల్లగా రన్నింగ్ చేయడం మొదలు పెట్టినట్లు చెప్పాడు. అదే విధంగా ఔట్ సైడ్ ఫుడ్ వాడకం దాదాపు తగ్గించినట్లు తెలిపాడు. మరీ తప్పని పరిస్థితి అయితే తప్ప జంక్ ఫుడ్ తీసుకోవడం లేదని తెలిపాడు. బయటి ఫుడ్ అంటే లక్జరీ అనే భ్రమ నుంచి బయట పడాలని సూచిస్తున్నాడు. ఇంట్లో వండిన ఆహారానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలని తెలిపాడు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేసినట్లు చెప్పాడు. అదే విధంగా తను ఎర్లీగా పడుకుని.. కనీసం 8 గంటలు నిద్ర పోయినప్పటికీ.. క్వాలిటీ స్లీప్ లేకపోవడంతో స్ట్రెస్ పెరిగిందని.. గుండె అనారోగ్యానికి ఇది కూడా ఒక కారణమని చెప్పాడు.
లైఫ్ను మార్చిన రెండు విషయాలు:
కార్తీక్ చెప్పిన రెండు విషయాలలో క్వాలిటీ స్లీప్, డైలీ మూవ్మెంట్స్.
- పడుకునే ముందు డీప్ బ్రీతింగ్ ఎక్ససైజ్. అంటే పూర్తిగా గాలి పీల్చుకుని.. పూర్తిగా వదలటం వలన.. క్వాలిటీ స్లీప్ ఉంటుంది.
- ప్రతి రోజూ కనీసం రెండు సార్లు డీప్ బ్రీతింగ్ ఎక్ససైజ్ చేయాలి. అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి.
- శ్వాస సంబంధమైన వ్యాయామం కారణంగా.. స్ట్రెస్ తగ్గించేందుకు తోడ్పడుతుంది.
- నిద్ర కోసం ఏవేవో ప్రయత్నాలు చేసే బదులు.. ఈ సింపుల్ టిప్ వలన క్వాలిటీ స్పీల్ ఉంటుంది.
మూవ్ మెంట్స్ తప్పనిసరి..
- క్రమం తప్పకుండా బాడీ కదలికలు చాలా ముఖ్యం అని కార్తీక్ చెబుతున్నాడు.
- రోజంతా ఒకే చోట కూర్చుని.. సాయంత్రమో, ఉదయమో వాకింగ్, రన్నింగ్ చేసినా ఫలితం ఉండదు.
- షార్ట్ వాకింగ్ చాలా ఫలితాలను ఇస్తుందని చెప్తున్నాడు.
- గంటకు ఒక సారి కొద్ది దూరం నడవటం బాడీలో చాలా మార్పు తీసుకువస్తుంది.
- గంటకు కనీసం 250 అడుగులు నడవటం తో గుండెను పదిలంగా ఉంచుకోవచ్చునని చెప్తున్నాడు.
