జీడిమెట్ల, వెలుగు: రన్నింగ్కారులో మంటలు చెలరేగిన ఘటన సుచిత్ర అంగడిపేటకు కొద్ది దూరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లి నాగార్జున డ్రీమ్ల్యాండ్ లో నివాసం ఉండే హుస్సేన్ బిరిదర్ ఆదివారం రాత్రి కారులో పెద్ద అంబర్పేట్ వెళ్తున్నాడు.
సుచిత్ర అంగడిపేట వద్ద బంక్ లో పెట్రోల్ పోయించుకున్నాడు. తర్వాత కొద్ది దూరం వెళ్లగానే కారు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. హుస్సేన్వెంటనే కిందికి దిగాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
