రూపాయికి జోష్.. 20 నెలల్లో ఎన్నడూ లేనంత పైకి

రూపాయికి జోష్.. 20 నెలల్లో ఎన్నడూ లేనంత పైకి

ముంబై: రూపాయి దూకుడు కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడు సెషన్లలో రూపాయి లాభపడింది. దీంతో దీని విలువ ఆరు నెలల గరిష్టానికి చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్‌ మార్కెట్లోకి ఫండ్స్‌ గుమ్మరించడంతో, ఆర్‌బీఐ పెద్ద ఎత్తున డాలర్లను కొంటుండటంతో రూపాయి బలపడుతోంది. దీంతో డాలర్‌తో రూపాయి (కన్వర్టబుల్‌) మారకం విలువ శుక్రవారం 0.6 శాతం పెరిగి 73.40కి చేరింది. ఇదివరకటి సెషన్‌లో ఇది 73.81 వద్ద ముగిసింది. ఒక సమయంలో 73.28 మార్కును కూడా తాకింది. ఇంత తక్కువ విలువ రికార్డు కావడం మార్చి ఐదు తరువాత ఇదే మొదటిసారి. శుక్రవారం సెషన్‌లో 73.28– 73.87 మధ్యలో ట్రేడ్‌‌‌‌ అయింది. ఈవారంలో ఇప్పటి వరకు రూపాయి విలువ రెండుశాతం పెరిగింది. 2018 డిసెంబరు 21 తరువాత వీక్లీగెయిన్‌ ఇంత ఎక్కువ ఉండటం ఇదే మొదటిసారి. ఇండియాతోపాటు ఇతర ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు కూడా మెరుగ్గా ఉండటం కూడా రూపాయి బలోపేతానికి కారణమని ఎనలిస్టులు తెలియజేశారు.

For More News..

పెద్ద జాబ్స్ చేసేటోళ్లకే… ఎక్కువ టెన్షన్

కిరాయికి మారుతి కారు.. నెలకు ఎంతంటే?

రాష్ట్రంలో 2,751 కరోనా పాజిటివ్ కేసులు