దేశాధ్యక్షుడిగా స్కూల్ టీచర్ గెలుపు

దేశాధ్యక్షుడిగా స్కూల్ టీచర్ గెలుపు

లిమా: ఏ స్థాయి వారైనా మంచి పనులతో ప్రజల ఆదరణ సంపాదించుకుంటే ఏమైనా సాధించవచ్చు.. ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని ఒక సామాన్య గ్రామీణ టీచర్ రుజువు చేశాడు. ఏకంగా దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించాడు. రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా ప్రజల్లో ఆదరణ.. వారి ప్రోద్భలంతో ఎన్నికల్లో పోటీ చేసిన 51 ఏళ్ల పెడ్రో కాస్టిల్లా సోమవారం ఓట్ల లెక్కింపులో సుమారు 44వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. దక్షిణ అమెరికా దేశంలో రన్ఆఫ్ ఎన్నికలు జరిగిన ఒక నెల తరువాత ఎన్నికల అధికారులు తుది అధికారిక ఫలితాలను విడుదల చేశారు. దాదాపు పాతిక సంవత్సరాలకుపైగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాల టీచర్ గా పనిచేసిన పెడ్రో కాస్టిల్లా ఈసారి జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగి సత్తా చాటాడు. తన సమీప ప్రత్యర్ధి, రాజకీయంగా విశేష అనుభవ శాలి అయిన పాపులర్ ఫోర్స్ పార్టీ అభ్యర్థి కైకో ఫుజిరిమోరిపై దాదాపు 44 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. గత నెల 6వ తేదీన పెరు దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి.రాగి ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న పెరు కరోనా సంక్షోభం వల్ల ఏడాదిన్నర కాలంలో ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతినింది. దశాబ్దం వెనక్కు వెళ్లిపోవడంతో దేశంలో 75శాతం మంది పేదరికాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో సామాన్యుల తరపున పెడ్ర కాస్టిల్లో ఎన్నికల బరిలోకి దిగి వినూత్న తరహాలో అందర్నీ ఆలోచింపచేసేలా ప్రచారం చేసి ఆకట్టుకున్నాడు. దక్షిణ అమెరికా దేశంలో రన్ ఆఫ్ ఎన్నికలు జరిగిన ఒక నెల రోజుల  తర్వాత ఎన్నికల అధికారులు తుది ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.  సోమవారం కౌంటింగ్ ప్రారంభించగా.. హోరాహోరీ పోరు వల్ల ఓట్ల లెక్కింపు ప్ర్రక్రియ సుదీర్ఘంగా సాగింది. చివరకు పెడ్రో కాస్టిల్లో (51) ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.