లైక్స్ సరే.. యువకుడు ఊచలు లెక్కిస్తున్నాడు.. ఫాలోవర్స్ కోసం రద్దీ రోడ్లపై బైక్ స్టంట్స్..యువకుడు అరెస్ట్

లైక్స్ సరే..  యువకుడు ఊచలు లెక్కిస్తున్నాడు.. ఫాలోవర్స్  కోసం  రద్దీ రోడ్లపై బైక్ స్టంట్స్..యువకుడు అరెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: సోషల్ మీడియాలో లైక్​లు, ఫాలోవర్స్ కోసం రద్దీ రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తున్న బంజారాహిల్స్​కు చెందిన షాదాబ్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగర రోడ్లపై అతను బైక్​తో వీలింగ్​లు చేస్తూ ప్రమాదకర విన్యాసాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్రమత్తమయ్యారు. అతనిపై కేసు నమోదు చేసి, మంగళవారం అరెస్ట్ చేశారు.