ఖేర్సన్ సిటీని స్వాధీనం చేసుకున్న రష్యా 

ఖేర్సన్ సిటీని స్వాధీనం చేసుకున్న రష్యా 

ఉక్రెయిన్పై రష్యా దాడులు తీవ్రం చేసింది. రాజధాని కీవ్పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న సైన్యం.. ఇతర నగరాలను హస్తగతం చేసుకుంటోంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్లోని అతిపెద్ద సిటీ ఖేర్సన్ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా పాలమిలటరీ బలగాలు ఖేర్సన్లో బాంబుల వర్షం కురిపిస్తుండటంతో డజన్ల కొద్దీ పౌరులు మరణిస్తున్నారు. 

మరోవైపు ఖార్కివ్ నగరంపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖార్కివ్ లోని పోలీస్ బిల్డింగ్ ను మిస్సైల్ తో పేల్చివేసినట్లు సమాచారం. ఈ ఘటనలో పోలిస్ బిల్డింగ్ మంటల్లో పూర్తిగా దగ్దమైనట్లు తెలుస్తోంది. రష్యా దాడుల్లో కరాజిన్ నేషనల్ యూనివర్సిటీలోని ఓ భవనం కూడా ధ్వంసమైనట్లు ఆ దేశ హోం శాఖ ప్రకటించింది. 

మరిన్ని వార్తల కోసం..

పాక్ విద్యార్థులను కాపాడిన  భారత జెండా

భారతీయుల కోసం ఉక్రెయిన్ కు 50 విమానాలు