కొనసాగుతున్న రష్యా వైమానిక దాడులు

కొనసాగుతున్న రష్యా వైమానిక దాడులు

ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్కు చెందిన 74 మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. వాటిలో 11 వైమానిక స్థావరాలు కూడా ఉన్నాయి. మిలటరీ హెలికాప్టర్లతో పాటు నాలుగు డ్రోన్లను సైతం కూల్చినట్లు రష్యా డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు వైమానిక దాడులు కొనసాగుతుండగానే మరోవైపు ఉక్రెయిన్లోని తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంత సరిహద్దుల్లో దాదాపు లక్షన్నర మంది రష్యా సైనికులు మోహరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీస్థాయిలో సైనిక మోహరింపు జరగడం ఇదే తొలిసారి. 

ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు పలు పట్టణాల్లో బాంబుల మోత మోగుతోంది. రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 68 మంది మృతి చెందినట్లు ఏఎఫ్పీ వార్తా సంస్థ ప్రకటించింది. మృతుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు పౌరులు కూడా ఉన్నారు. ఉక్రెయిన్ ఒడిసా బ్లాక్ సీ పోర్ట్ సిటీ సమీపంలోని మిలటరీ బేస్ లో జరిగిన దాడిలో 18 మంది చనిపోయారు. రష్యా బలగాలు ఇప్పటికే రాజధాని కీవ్ను స్వాధీనంలోకి తీసుకున్నాయని ఉక్రెయిన్ బార్డర్ గార్డ్స్ ప్రకటించారు.