నేడు రష్యా న్యూక్లియర్ డ్రిల్!

నేడు రష్యా న్యూక్లియర్ డ్రిల్!
  • ఉక్రెయిన్​పై దాడి ఊహాగానాల మధ్య పుతిన్​ ప్రకటన
  • స్వయంగా డ్రిల్​ చూడనున్న రష్యా ప్రెసిడెంట్​

మాస్కో: రష్యా, ఉక్రెయిన్​ మధ్య నెలకొన్న టెన్షన్​ మరింత ముదురుతోంది. దాడి చేయబోమని రష్యా, చేసి తీరుతుందని అమెరికా కరాఖండిగా చెప్తున్న టైంలోనే.. రష్యా సంచలన ప్రకటన చేసింది. శనివారం న్యూక్లియర్​ డ్రిల్స్​ చేస్తామని ప్రకటించింది. డ్రిల్స్​లో భాగంగా వేరే ఖండాల మీద దాడి చేసేందుకు వీలుగా తయారు చేసి పెట్టుకున్న ఇంటర్​కాంటినెంటల్​ బాలిస్టిటిక్​ మిసైల్స్​, క్రూయిజ్​ మిసైల్స్​ను టెస్ట్​ చేస్తామని రష్యా రక్షణ శాఖ శుక్రవారం ప్రకటన చేసింది. ఈ డ్రిల్స్​ను ప్రెసిడెంట్​ వ్లాదిమిర్​ పుతిన్​ స్వయంగా దగ్గరుండి చూస్తారని వెల్లడించింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితులపై రష్యా రక్షణ శాఖ అధికారులతో పుతిన్​ సమావేశమయ్యారు.

పుతిన్​ లాంచ్​ ప్రాక్టీస్
డిఫెన్స్​ మినిస్ట్రీ సిచువేషన్​ రూం నుంచి మిసైల్స్​ లాంచ్​ను పుతిన్​ పరిశీలిస్తారని, ఆయన కూడా మిసైల్​ లాంచింగ్​ను ప్రాక్టీస్​ చేస్తారని రక్షణ శాఖ అధికారి దిమిత్రీ పెస్కోవ్​ చెప్పారు. డ్రిల్స్​ చేస్తున్నట్టు చాన్నాళ్ల క్రితమే ఇన్ఫార్మ్​ చేశామని, వెస్టర్న్​ కంట్రీస్​ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బాలిస్టిక్​ మిసైల్స్​ ప్రాక్టీస్​ లాంచ్​ ఎప్పుడూ జరిగేదేనని పేర్కొన్నారు. ‘బ్లాక్​ సీ ఫ్లీట్​(నల్ల సముద్రంలో మోహరించిన సైన్యం)’ కేంద్రంగా ఈ న్యూక్లియర్​ డ్రిల్స్​ జరగనున్నట్టు తెలుస్తోంది. యుద్ధ నౌకలు, సబ్​మెరీన్లను కాలిబర్​ క్రూయిజ్​ మిసైల్స్​తో పవర్​ఫుల్​గా తయారు చేశారు. ప్రస్తుతం వాటిలో బాలిస్టిక్​ మిసైల్స్​ లేవని అధికారులు చెప్తున్నారు. బ్లాక్​ సీ ఫ్లీట్​తో పాటు స్ట్రాటజిక్​ మిసైల్​ఫోర్సెస్​, రష్యా ఎయిర్​ఫోర్స్, నార్తర్న్​ ఫ్లీట్​ కూడా డ్రిల్స్​లో పాల్గొంటాయని అంటున్నారు. కాగా, రష్యాకు దీటుగా ఉక్రెయిన్​ కూడా యాంటీ ట్యాంక్​ డ్రిల్స్​ను నిర్వహించింది.   

రష్యా దాడి చేస్తుంది: బైడెన్
అమెరికా డిప్లొమాట్​ను రష్యా బహిష్కరించిందని, దీంతో ఉక్రెయిన్​పై ఆ దేశం దాడి చేసే ముప్పు ఎక్కువగా ఉందని అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ హెచ్చరించారు. రెచ్చగొట్టేవిధంగా దాడులకు పాల్పడితే దానికి తగ్గట్టు బదులు చెప్తామని వార్నింగ్​ ఇచ్చారు. వెస్టర్న్​ కంట్రీస్ లీడర్లతో బైడెన్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా భేటీ కానున్నారు. ఉక్రెయిన్​ మీద దాడి చేయబోమంటూ రష్యా ప్రకటించాలంటూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​ సవాల్​ చేశారు. ఆ విషయాన్ని సూటిగా.. స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. బలగాలు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలను వెనక్కు తీసుకెళ్లి ప్రపంచానికి చూపించాలన్నారు.

ఇండియన్లను తీసుకొచ్చేందుకు మూడు ఫ్లైట్లు: ఎయిర్​ ఇండియా
ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన ఇండియన్లు, స్టూడెంట్లను తీసుకొచ్చేందుకు 3 విమానాలను నడుపుతున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఈ నెల 22, 24, 26వ తేదీల్లో ఉక్రెయిన్​లోని బోరిస్పిల్​ ఎయిర్​పోర్ట్​ నుంచి ఫ్లైట్లు నడుస్తాయని వెల్లడించింది. ఎయిరిండియా బుకింగ్​ ఆఫీసులు, వెబ్​సైట్​, ఆథరైజ్డ్​ ట్రావెల్​ ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్​ చేసుకోవచ్చని సూచించింది.