ఉక్రెయిన్ అమ్మాయితో రష్యా అబ్బాయి ట్రెడీషనల్ వెడ్డింగ్

ఉక్రెయిన్ అమ్మాయితో రష్యా అబ్బాయి ట్రెడీషనల్ వెడ్డింగ్

నిజమైన ప్రేమకు భాషతో గానీ, దేశంతో గానీ అవసరం లేదని నిరూపించారు ఓ ప్రేమికుల జంట. వారి దేశాల మధ్య తీవ్ర శతృత్వం కొనసాగుతున్నా.. తమ ప్రేమను నిలబెట్టుకొని ముందుకు సాగారు. వారే రష్యా- ఉక్రెయిన్ కు చెందిన  ప్రేమికులు. రష్యాకు చెందిన వరుడు ఉక్రెయిన్ కు చెందిన వధువుతో ఇటీవల జరిగిన వివాహం అంతటా చర్చనీయాంశంగా మారింది. గత 6 నెలలుగా వారివురి దేశాల మధ్య జరుగుతున్న యుద్దం.. వారి ప్రేమను ఆపలేకపోయింది. రీసెంట్ గా వీరి పెళ్లి కూడా జరగడం... అది కూడా హిందూ సంప్రదాయంలో జరగడం అందర్నీ ఆకర్షిస్తోంది. దీంతో వీరిద్దరిదీ నిజమైన ప్రేమ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నగరంలోని ఖరోటా దివ్య ఆశ్రమం వద్ద ఈ జంట పెళ్లి చేసుకుంది. వరుడి పేరు సెర్గీ నోవికోవ్. .. కాగా వధువు అలియోనా బ్రమోకా. వారు భారతదేశానికి వచ్చి ధర్మశాల సంప్రదాయ పాటల మధ్య ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. హిందూ ఆచారాల ప్రకారం ఏడు ప్రదక్షిణలు చేసి ఒకరికొకరు అండగా ఉంటామని ప్రమాణం చేశారు. వారి వివాహానికి సంబంధించిన పోస్ట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.  గత 2 సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్న వీరు... అప్పట్లో ఇరు దేశాల మధ్య పరిస్థితులు బాగానే ఉన్నా.. ఇప్పుడు పరిస్థితి సీరియస్‌గా మారినా ఈ జంట ప్రేమపై ఎలాంటి ప్రభావం పడలేదు. వాస్తవానికి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తరువాత పెళ్లి చేసుకోవాలని ఈ జంట మొదట భావించినా.... ప్రస్తుత పరిస్థితుల రిత్యా అవి ఇప్పట్లో సమసిపోయేలా లేవని భావించి వారు వివాహం చేసుకున్నారు.