నల్ల సముద్రంపై నుంచి రష్యా దాడులు

నల్ల సముద్రంపై నుంచి రష్యా దాడులు

ఉక్రెయిన్ పై మూడోవారం రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బాంబులు, క్షిపణులతో ఊహించని రీతిలో రష్యా దాడులు ముమ్మరం చేసింది. ఇవాళ మరో కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించి ఉక్రెయిన్ ఆయుధ నిల్వల కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించుకుంది. ఒక వైపు పోర్ట్ సిటీ మరియుపోల్ పై బీకరదాడులు కొనసాగిస్తున్న రష్యా అటు నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రంలోని నౌకల నుంచి ఉక్రెయిన్ పై క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది.

మాస్కో సేనలు ఓ ఆర్ట్ స్కూల్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఆశ్రమంలో సుమారు 400 మంది ఆశ్రయం పొందుతున్నట్లు సమాాచారం. మాస్కో సేనల దాడుల్లో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద వందల మంచి చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన యుద్దంలో ఇప్పటి వరకు 115 మంది అమాయక చిన్నారులు కన్నుమూశారని మరో 140మందికిపైగా గాయపడ్డారని ఉక్రెయిన్ పార్లమెంట్ ప్రకటించింది. ‘ఇవి సంఖ్యలు కావు.. వందలాది ఉక్రెనియన్ కుటుంబాల దుఃఖానికి కొలమానం..’ అంటూ ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేసింది. 

 

 

ఇవి కూడా చదవండి

బ్రిటీష్​ ఆలోచనా విధానాలను వదిలెయ్యాలి

అలా చేస్తే రేవంత్ హీరో అని ఒప్పుకుంటా..

నాగాలాండ్ అసెంబ్లీ .... మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీ