నాగాలాండ్ అసెంబ్లీ .... మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీ

నాగాలాండ్ అసెంబ్లీ .... మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీ

నాగాలాండ్: దేశంలోనే మొట్టమెదటి పేపర్లెస్ అసెంబ్లీగా నాగాలాండ్ అసెంబ్లీ చరిత్ర సృష్టించింది. నాగాలాండ్‌ అసెంబ్లీలో నేషనల్‌ ఈ-విధాన్‌ అప్లికేషన్‌ (NeVA) ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నారు. దీంతో సభా కార్యకలాపాల్లో పేపర్‌ను వినియోగించడానికి అవకాశం లేదు. ఎమ్మెల్యేలకు చెందిన ప్రతి టేబుల్పై ఈ-బుక్‌ లేదా ట్యాబ్లెట్‌ను అమర్చారు. దీంతో ఎమ్మెల్యేలు కాగితాలతో పనిలేకుండా తమకు అవసరమైన సమాచారాన్ని పూర్తి ట్యాబ్లెట్‌లోనే చూసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 60 మంది సభ్యులున్న నాగాలాండ్ టెక్నాలజీని వినియోగించడంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. పేపర్ వాడకాన్ని తగ్గించడం వల్ల చెట్లను నరికివేయాల్సిన అవసరముండదని, దీంతో ప్రకృతికి మేలు జరుగతుందని, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల సమాచారాన్ని వేగంగా అందించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

వాకింగ్ ఎంత నడవాలి? ఎలా నడవాలి?

యుద్ధాన్ని ఆపకుంటే.. రష్యా కోలుకోవడానికి ఓ తరం పడతది