జెలెన్‌‌‌‌స్కీ సొంత నగరంపై.. రష్యా మిసైళ్ల దాడి..10 మందికి పైగా మృతి

జెలెన్‌‌‌‌స్కీ సొంత నగరంపై.. రష్యా మిసైళ్ల దాడి..10 మందికి పైగా మృతి

కీవ్: ఉక్రెయిన్‌‌‌‌ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌స్కీ సొంత నగరం క్రైవీ రిహ్‌‌‌‌పై రష్యా మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 10 మందికి పైగా చనిపోయారు. క్రూయిజ్ మిసైళ్ల ధాటికి ఓ ఐదంతస్తుల భవనం సహా పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉండొచ్చని క్రైవీ రిహ్‌‌‌‌ మేయర్‌‌‌‌ ఒలెక్జాండర్ విల్కుల్ చెప్పారు. మిసైల్ దాడి తర్వాత ఐదంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుందని డెనిప్రోపెట్రోవ్స్క్‌‌‌‌ గవర్నర్‌‌‌‌ షెర్హీలిసాక్‌‌‌‌ తెలిపారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్లు ప్రయత్నించడం వాటిలో కనిపించింది. ‘‘మరిన్ని టెర్రరిస్టు మిసైళ్లు. సామాన్య ప్రజలు, వారు నివసించే భవనాలు, పట్టణాలపై రష్యా హంతకులు యుద్ధాన్ని కొనసాగించారు’’ అని జెలెన్‌‌‌‌స్కీ మండిపడ్డారు. 

కీవ్‌‌‌‌, ఖార్కీవ్‌‌‌‌పైనా దాడులు

కీవ్‌‌‌‌పై కూడా రష్యా దాడులను కొనసాగించింది. క్షిపణులను ఎయిర్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌ వ్యవస్థలు కూల్చివేశాయని కీవ్‌‌‌‌ మిలిటరీ రీజియన్‌‌‌‌ అధికారులు వెల్లడించారు. ఖార్కీవ్‌‌‌‌లో ఇరాన్‌‌‌‌కు చెందిన షాహిద్ డ్రోన్లతో రష్యా అటాక్స్ చేసింది. షెవ్‌‌‌‌చెన్కోవ్‌‌‌‌లో ఇద్దరు గాయపడినట్లు గవర్నర్ తెలిపారు.