
- మెట్ల మీద నుంచి జారిపడ్డ పుతిన్!
- విరిగిన వెన్నెముక చివరి ఎముక
రష్యా అధ్యక్షుడు పుతిన్ (70) మెట్ల మీద నుంచి పడడంతో వెన్నెముక చివర విరిగిందని ‘న్యూయార్క్ పోస్ట్’ వెల్లడించింది. దీంతో మలమూత్ర విసర్జనలో కంట్రోల్ కోల్పోయారని చెప్పింది.
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (70) ఆరోగ్య పరిస్థితి పట్ల మళ్లీ ఓ కొత్త వార్త తెరపైకి వచ్చింది. మాస్కోలోని తన అధికారిక నివా సంలో మెట్లపై నుంచి పుతిన్ ఇటీవల జారి కింద పడ్డారని, వెన్నెముకలోని చివరి ఎముక (టెయిల్ బోన్) విరి గిందని ‘న్యూయార్క్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ఐదు మెట్ల ఎత్తు నుంచి కింద పడటంతో టెయిల్ బోన్ విరిగినట్లు తెలిపింది. మల మూత్ర విసర్జనలో కంట్రోల్ కోల్పో యారని, ఆయన ప్రమేయం లేకుం డానే మలమూత్ర విసర్జన జరుగు తోందని వెల్లడించింది. పుతిన్ సెక్యూరిటీ టీంతో సంబంధం ఉన్న ఓ టెలిగ్రాం చానల్ ద్వారా ఈ విష యం తెలిసినట్లు పేర్కొంది. ఇక పోయిన నెలలో క్యూబా ప్రెసిడెంట్ మిగ్యేల్ డయాజ్ కానెల్తో భేటీ సందర్భంగా పుతిన్ చేతులు పర్పుల్ కలర్లో కనిపించాయని, పైగా చేతులు వణికాయని బ్రిటన్ కు చెందిన ‘ఎక్స్ ప్రెస్’ పత్రిక తెలిపింది.