ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమని ప్రకటించిన పుతిన్

ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమని ప్రకటించిన పుతిన్

ఉక్రెయిన్ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమని పుతిన్ ప్రకటించారు. బెలారస్ రాజధాని మిన్స్క్ కు  ప్రతినిధుల బృందాన్ని పంపిస్తామని భారత దేశంలోని రష్యా  ఎంబసీ  ప్రకటించింది. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమని రష్యా విదేశాంగ మంత్రి కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.. మరో వైపు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్  కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్ లో కొనసాగుతున్న సంక్షోభం పరిస్థితులపై మాట్లాడారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని పుతిన్ కు సూచించారు

మరోవైపు అధ్యక్షుడిని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం అలెర్ట్ అయ్యింది. జెలెన్ స్కీ ని బంకర్లోకి తరలించినట్లు తెలుస్తోంది. రష్యాపై పోరాటంలో ప్రపంచ దేశాలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు..యుద్ధ అనుభవం ఉన్న వాళ్లు ఉక్రెయిన్ కు సహకరించాలని యూరోపియన్లను కోరారు. 18 వేల మందికి ఆయుధాలు ఇచ్చినట్లు ప్రకటించారు. దేశ భవిష్యత్ ప్రతి ఒక్క పౌరుడి చేతిలో ఉందని అన్నారు.

 

భీమ్లా నాయక్ పై చిరు ట్వీట్..