రష్యాలో లింగ మార్పిడి నిషేధిస్తూ చట్టం.. పుతిన్ సంతకం

రష్యాలో లింగ మార్పిడి నిషేధిస్తూ చట్టం.. పుతిన్ సంతకం

లింగమార్పిడిని నిషేధిస్తూ రష్యా ప్రభుత్వం చట్టం చేసింది. లింగమార్పు శస్త్రచికిత్స, హార్మోన్ థెరపీపై నిషేధం చట్టంపై  అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం సంతకం చేశారు. సాంప్రదాయ విలువలను కాపాడటం పై దృష్టి సారించిన రష్యా ప్రభుత్వం.. వ్యక్తి లింగాన్ని మార్చడానికి ఉద్దేశించిన వైద్య జోక్యాలను నిషేధిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించింది. పుట్టుకతో వచ్చిన లింగపరమైన లోపాలు ఉన్న వ్యక్తులకు ఈ చట్టం వర్తించదని స్పష్టం చేసింది. 

ఈ చట్టం ప్రకారం.. అధికారిక గుర్తింపు పత్రాల్లో లింగాన్ని మార్చుకోకుండా నిషేధిస్తుంది.  లింగమార్పిడి వ్యక్తులు పిల్లలను దత్తత తీసుకోవడం,  ఒక భాగస్వామి వారి లింగాన్ని మార్చుకున్న వివాహాన్ని ఈ చట్టం రద్దు చేస్తుంది. రష్యా సాంప్రదాయ విలువను కాపాడేందుకే ఈ చట్టం తీసుకొచ్చినట్లు క్రిమ్లిన్ ప్రకటించింది.