కనిపించినోళ్లందరినీ కాల్చి పడేయాలంటూ ఆదేశాలు

కనిపించినోళ్లందరినీ కాల్చి పడేయాలంటూ ఆదేశాలు

న్యూయార్క్: కనిపించినోళ్లందరినీ కాల్చి పడేయాలంటూ పై నుంచి ఆదేశాలు రావడం.. అమాయక ప్రజలను కాల్చి చంపేందుకు మనసొప్పకపోతుండటంతో రష్యన్ సోల్జర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నరు. మామూలు జనంపై దాడులు చేయలేక ఏడ్చేస్తున్నారు. చివరకు పై అధికారులు ఇచ్చే ఆదేశాలను బేఖాతర్​ చేస్తున్నారు. ప్రజలను చంపలేక తమ సొంత యుద్ధ ట్యాంకులు, ఆర్మీ వెహికల్స్​ను ధ్వంసం చేస్తున్నరు. ఈ మేరకు అమెరికా సైనికాధికారి ఒకరు చెప్పిన వివరాలతో న్యూయార్క్​ టైమ్స్​కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం రష్యా సైన్యంలో ఎక్కువ మంది యువకులే ఉన్నారని, వారికి సరైన శిక్షణ కూడా లేదని, పూర్తి స్థాయి యుద్ధానికి వారిని సిద్ధం చేయలేదని ఆ అధికారి చెప్పారు.  తిండి, ఇంధనం వంటి వనరులనూ సరిపడా ఇవ్వలేదన్నారు. దీంతో సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతింటోందన్నారు. ఈ క్రమంలోనే సొంత యుద్ధ ట్యాంకులనే వాళ్లు ధ్వంసం చేస్తున్నారని వివరించారు. ఆ కథనాన్ని బలపరిచేలా రష్యా సైనికులు, ఉన్నతాధికారులకు మధ్య జరిగిన సంభాషణల టేప్​ను బ్రిటన్​ నిఘా సంస్థ షాడోబ్రేక్​ ఇంటెల్ విడుదల చేసింది. జనాలను ఖాళీ చేయించే వరకు టౌన్లపై దాడులు చేయబోమంటూ కొందరు సైనికులు ఆఫీసర్లకు తేల్చి చెప్పడం ఆ ఆడియోల్లో రికార్డయింది.