Shocking Incident:గుహలో ఇద్దరు పిల్లలతో రష్యన్ మహిళ..నెలల తరబడి జీవనం..ఎలా వచ్చింది..ఏమి చేస్తోంది

Shocking Incident:గుహలో ఇద్దరు పిల్లలతో రష్యన్ మహిళ..నెలల తరబడి జీవనం..ఎలా వచ్చింది..ఏమి చేస్తోంది

పర్వత ప్రాంతంలో దట్టమైన అడవి..ఆదిమ మానవుడిలా గుహలో మహిళ జీవనం..పైగా ఇద్దరు చిన్న పిల్లలతో..నీళ్లు లేవు, కరెంట్ లేదు..ఎలా జీవిస్తోందో తెలియదు..దేశం కానీ దేశం నుంచి వచ్చింది..అటవీ ప్రాంతంలో దీనస్థితిలో బతుకుతోంది.. పోలీసులు చూశారు కాబట్టి సరిపోయింది.  లేకపోతే ఆమె, ఆమె పిల్లల పరిస్థితి ఏమౌనో.. కర్ణాటకలో గోకర్ణ గుహల్లో ఓ రష్యన్ మహిళ గత కొద్దిరోజులుగా దుర్భరమైన స్థితిలో జీవిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. 

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ సమీపంలోని రమతీర్థ పర్వత ప్రాంతంలోని ఒక దట్టమైన అడవిలో ఉన్న గుహలో ఓ రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు జీవిస్తున్న ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల రష్యన్ మహిళ నినా కుటినా ఆమెను "మోహి" అనే పేరు కూడా పిలుస్తారట. గుహలో ఆమెతోపాటు ఆమె పెద్ద కుమార్తె ప్రేమా (సుమారు 6.5 ఏళ్లు), చిన్నారి ఆమా (4 ఏళ్లు) ఉన్నారు. 

రోజూ గోకర్ణ రమతీర్థ పర్వతాన్ని సందర్శించే ట్రెక్కర్లు గుహ వెలుపల బట్టలు ఆరేసి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో జులై 9, 2025న పోలీసులు గుహను పరిశీలించగా అక్కడ ఈ రష్యన్ మహిళ తన ఇద్దరు పిల్లలతో నివసిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.

ఆధ్యాత్మిక శాంతి కోసం ఇండియాకు వచ్చిందని, ప్రత్యేకించి గోకర్ణ వంటి పవిత్ర ప్రదేశాలలో ధ్యానం, సాధన కోసం గుహలో ఉండటాన్ని నినా అభిరుచిగా భావించిందట. ఆమెకు ప్రకృతి, ప్రశాంతత అంటే మక్కువ ఉండటంతో పిల్లలతో సహా గుహలోకి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.  

సుమారు పదిహేను రోజులుగా గుహలో ఉంటున్నారు. తినేందుకు కొద్దిపాటి పండ్లు,ప్రకృతి వనరులు ఉపయోగించుకున్నారట. విద్యుత్, నీరు లేకుండానే గుహలోనే ఉండిపోయారు. పోలీసులు రక్షించిన సమయంలో తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, తగిన భద్రతా వసతులు లేకుండా గుహలో ఉండటం వల్ల వారు ప్రమాదంలో ఉన్నట్టు చెబుతున్నారు అధికారులు.  

వీసా సమస్య:

నినా 2017లో బిజినెస్ వీసాతో ఇండియాకు వచ్చింది. వీసా గడువు ముగిసిన తరువాత కూడా ఇండియాలోనే ఉన్నారు. 2018లో నెపాల్ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వీసా పునరుద్ధరణ జరగకపోవడంతో ఆమె ఇప్పటి వరకు అక్రమంగా ఇండియాలో ఉంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

►ALSO READ | Viral video: వర్షంలో షెల్టర్ అడిగినందుకు..భక్తులను దారుణంగా కొట్టిన షాపు ఓనర్లు

మహిళను కర్వార్ లోని మహిళా రిసెప్షన్ సెంటర్ కు తరలించారు. పిల్లలు తాత్కాలికంగా అదే కేంద్రంలో తల్లి దగ్గరే ఉన్నారు. ఆమెను Foreigners Regional Registration Office (FRRO), బెంగళూరు కు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. రష్యా ఎంబసీతో మాట్లాడి ఆమె దేశానికి తిరిగి పంపే పనిలో పడ్డారు అధికారులు. 

రష్యన్ మహిళ నినా కుటినా గోకర్ణ గుహలో తన ఇద్దరు పిల్లలతో నివసించడం ఓ అసాధారణ సంఘటన. ఈ ఘటన భారత్ లో శాంతి, ఆధ్యాత్మికత కోసం వచ్చే విదేశీయుల జీవనశైలిపై చిత్రవిచిత్ర ప్రశ్నలకు తావిస్తోంది. తల్లీపిల్లల భద్రతతో పాటు వీసా ఉల్లంఘన అంశాలపై ఇప్పుడు అధికారులు విచారణ చేస్తున్నారు.