
రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఖాతు శ్యామ్ దేవాలయం దగ్గర ఇటీవల దారుణ సంఘటన జరిగింది. వర్షం నుంచి ఆశ్రయం పొందేందుకు దుకాణంలోకి ప్రవేశించిన భక్తులను దుకాణదారులు విచక్షణారహితంగా కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.
ఎలా జరిగింది?
ఈ ఘటన ఖాతు శ్యామ్ దేవాలయం సమీపంలోని షాపుల దగ్గర శుక్రవారం(జూలై 11) ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నుంచి వచ్చిన కొందరు భక్తులు బాబా శ్యామ్ దర్శనం కోసం ఖాతు శ్యామ్ జీకి వచ్చారు. ఉదయం భారీ వర్షం కురుస్తుండటంతో భక్తులు వర్షం నుంచి రక్షించుకునేందుకు శ్యామ్ కుండ్ సమీపంలోని ఓ దుకాణం లోకి వెళ్లారు. భక్తులు దుకాణదారుడిని కొద్దిసేపు లోపల ఆశ్రయం పొందేందుకు అనుమతి కోరగా, దుకాణదారుడు నిరాకరంచడమే కాకుండా వారిపై దురుసుగా ప్రవర్తించాడు.
ALSO READ | హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కత్తిపోట్ల కలకలం.. అర్థరాత్రి సోమాలియా దేశస్తుడిపై దాడి
దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మొదలై అది తోపులాట వరకు దారితీసింది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దుకాణదారులు ,వారి ఉద్యోగులు కర్రలతో భక్తులపై దాడి చేశారు. దీనికి ప్రతిగా భక్తులు కూడా ప్రతిఘటించారు..ఫలితంగా ఇరుపక్షాల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఈ దాడిలో షాప్ కీపర్లు మహిళలను కూడా వదల్లేదు. వారిని కూడా కర్రలతో దారుణంగా కొట్టారు. వారి మంగళసూత్రాలు, బంగారు గొలుసులు కూడా లాక్కున్నారని భక్తులు ఆరోపించారు.ఈ దాడిలో పిల్లలు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
*Warning - Fight Scene*
— Avdhesh Pareek (@Zinda_Avdhesh) July 11, 2025
खाटूश्याम जी में देशभर से लोग आते हैं वो ये वीडियो देखकर क्या सोचते होंगे?
- खाटूश्याम जी मंदिर के मुख्य द्वार की ओर जाने वाले रास्ते पर कुछ दुकानदारों ने श्रद्धालुओं को बेरहमी से पीटा है.
- जानकारी के मुताबिक बरसात में कुछ श्रद्धालु दुकान के साइड में… pic.twitter.com/SAUDHRsKVZ
దాడికి సంబంధించిన మొత్తం ఎపిసోడ్ ను అక్కడున్న వారు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈవిషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నలుగురు దుకాణదారులు మాంగీలాల్, మేఘ్రాజ్ యోగి, రాజ్‌కుమార్, రాకేష్ మీనాలను అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే కొందరు భక్తులు పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక అధికారి అదంతా మర్చిపోయి ఇంటికి వెళ్ళండి అని చెబుతున్నారని భక్తులు ఆరోపించారు. ఇది భక్తులలో మరింత ఆగ్రహాన్ని పెంచింది.
ఆలయం చుట్టూ దుకాణాలు నడుపుతున్న కొందరు వ్యక్తులు గతంలో కూడా ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. వారికి ఆలయ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ సంఘటన మతపరమైన ప్రదేశాలలో భక్తుల భద్రత ,స్థానిక దుకాణదారుల ప్రవర్తనపై తీవ్ర చర్చకు దారితీసింది.