ఒకే ఓవర్లో ఏడు సిక్సులు..రుతురాజ్ ప్రపంచ రికార్డు

ఒకే ఓవర్లో ఏడు సిక్సులు..రుతురాజ్ ప్రపంచ రికార్డు

భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్ లో ఏడు సిక్సులు బాది ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఆరు బంతుల్లో ఆరు సిక్సులు మాత్రమే రికార్డుగా ఉండేది. ప్రస్తుతం రుతురాజ్ ..అరుదైన చరిత్రను నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ ఈ ఘనత సాధించాడు.  మహారాష్ట్ర తరపున ఆడుతున్న రుతురాజ్.. ఉత్తర్ ప్రదేశ్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో  ఒకే ఓవర్ లో ఏడు సిక్సులు బాదాడు. 

https://twitter.com/BCCIdomestic/status/1597134087470215168

ఆరు బంతుల్లో ఏడు సిక్సులు ఎలా..?

ఉత్తరప్రదేశ్కు చెందిన శివాసింగ్ 49వ ఓవర్ వేశాడు. ఈ సమయంలో క్రీజులో ఉన్న రుతురాజ్..మొదటి  నాలుగు బంతులను  సిక్సర్లుగా మలిచాడు. అయితే దీంతో  ఒత్తిడికి గురైన  శివాసింగ్.. ఐదో బాల్ను నోబాల్గా వేశాడు. ఆ  బంతిని కూడా రుతురాజ్ సిక్స్ కొట్టాడు. ఇక  చివరి రెండు బంతులను కూడా సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ ఓవర్‌లో 43 పరుగులు వచ్చాయి. ఏడు సిక్సులతో రుతురాజ్ వరల్డ్ రికార్డు నమోదు చేయగా.... ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా శివా సింగ్  చెత్తరికార్డును మూటగట్టుకున్నాడు.  ఈ మ్యాచ్లో తన ఇన్సింగ్స్లో రుతురాజ్  16 సిక్స్‌లు బాదడం విశేషం. మొత్తంగా 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 220 నాటౌట్ గా నిలిచాడు. 

మూడో ఆటగాడు రుతురాజ్..

ప్రపంచంలో ఏ స్థాయి క్రికెట్లోనూ ఒకే ఓవర్లో ఏడు సిక్సులు ఎవరూ కొట్టలేదు. దీంతో ఓవర్లో ఏడు సిక్సులు కొట్టిన తొలి ప్లేయర్గా రుతురాజ్ చరిత్ర నెలకొల్పాడు. ఇక ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన మూడో భారత క్రికెటర్గా రుతురాజ్ నిలిచాడు. గతంలో దేశవాళీ క్రికెట్లో రవిశాస్త్రి ఈ ఘనత సాధించాడు. ఇక ఆ తర్వాత 2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్పై యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టాడు.