వీళ్లు ఫెయిల్

వీళ్లు ఫెయిల్

ఓపెనింగ్‌‌‌‌ స్లాట్‌‌లో పోటీ ఎక్కువ ఉన్న సమయంలో వచ్చిన అవకాశాలను రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ (96 రన్స్) సద్వినియోగం చేసుకోలేదు. ఒక ఫిఫ్టీ తప్పితే మిగతా నాలుగు ఇన్నింగ్స్‌‌లోనూ జట్టుకు అవసరమైన ఆరంభం ఇవ్వలేకపోయాడు. రోహిత్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌ వంటి రెగ్యులర్‌‌ ఓపెనర్లు వస్తే రుతురాజ్‌‌ తప్పుకోవాల్సిందే. ఇక, కేఎల్‌‌ రాహుల్‌‌ గైర్హాజరీలో అనూహ్యంగా టీమ్‌‌ కెప్టెన్సీ అందుకున్న పంత్‌‌ (58 రన్స్)ఐదు మ్యాచ్‌‌ల్లో టాస్‌‌ కోల్పోవడంతో పాటు తనపై నమ్మకాన్ని కూడా కొద్దిగా కోల్పోయాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లోనూ అతను నిర్లక్ష్యమైన షాట్లతో ఒకే రకంగా ఔటై విమర్శలు ఎదుర్కొన్నాడు.   ఇక టన్నుల కొద్దీ టాలెంట్‌‌ ఉన్న శ్రేయస్‌‌ అయ్యర్‌‌ ఐపీఎల్‌‌తో పాటు ఈ సిరీస్‌‌లోనూ పేలవ ఫామ్ కొనసాగించాడు. నాలుగు ఇన్నింగ్స్‌‌ల్లో ఒక్క ఫిఫ్టీ కూడా లేకుండా 94 రన్సే చేశాడు. అవి కూడా టీమ్​కు ఏమాత్రం ఉపయోగపడలేదు.  ఐర్లాండ్‌‌తో టీ20లకు ఎంపికవని  అయ్యర్‌‌  ఇంగ్లండ్‌‌తో టీ20 సిరీస్‌‌లో చాన్స్‌‌ వస్తే కచ్చితంగా సత్తా చాటాల్సిందే. లేదంటే వరల్డ్ కప్‌‌ టీమ్‌‌లో ప్లేస్​ ఉండదు.