
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో ఎలెనా రిబకినా, కార్లోస్ అల్కరాజ్ ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో 9వ సీడ్ రిబకినా (కజకిస్తాన్) 6-–1, 6–-2తో రదుకానె (బ్రిటన్)పై నెగ్గి ముందంజ వేసింది. మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–2, 6–4, 6–0తో డార్డెరి (ఇటలీ)పై గెలిచి నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించగా, రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ యానిక్ సినర్ (ఇటలీ) 6–3, 6–2, 6–2తో అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
తద్వారా హార్డ్ కోర్టు గ్రాండ్ స్లామ్స్‌లో తన వరుస విజయాల రికార్డును 23కు పెంచుకున్నాడు. రోజర్ ఫెడరర్ తన తొలి 50 మ్యాచ్‌ల్లో 41 విజయాలతో ముందున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4, 6–4తో జాకబ్ ఫియర్ల్నీ (బ్రిటన్)పై, రబ్లెవ్ (రష్యా) 6–3, 6–3, 5–7, 7–6 (7/4)తో బోయెర్ (అమెరికా)పై నెగ్గారు. కానీ సిట్సిపాస్ (అర్జెంటీనా) 6–7 (5/7), 6–1, 6–4, 3–6, 5–7తో అల్ట్‌మలెర్ (జర్మనీ) చేతిలో ఓడాడు.
విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ఇగా స్వైటెక్ (పోలెండ్) 6-–1, 4–-6, 6–-4తో సుజాన్ లామెన్స్ (నెదర్లాండ్స్)పై, కోకో గాఫ్ (అమెరికా) 7–-6 (7/5), 6–-2తో డొన్నా వెకిచ్ (క్రొయేషియా)పై గెలిచారు. ఒసాకా (జపాన్) 6–-3, 6–-1తో బాప్టిస్టి (అమెరికా)పై, అనిసిమోవా (అమెరికా) 7-–-6 (7/2), 6–--2తో జాయింట్ (ఆస్ట్రేలియా)పై, ముచోవా (చెక్) 7–-6 (7/0), 6–-7 (3/7), 6–-4తో క్రిస్టీ (బెల్జియం)పై విజయం సాధించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.