రైతుబంధుకు నిధులు విడుదల

 రైతుబంధుకు నిధులు విడుదల

ఖరీఫ్ కు ముందే రైతుబంధు సాయం అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రైతుబంధుకు అవసరమైన 6వేల 900 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈసారి ఎకరాకు 5వేల చొప్పున రైతుబంధు నిధులు అందనున్నాయి. రైతుబంధు సాయం పెంపుపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేసేందుకు జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కేసీఆర్ ప్రకటన తర్వాతి రోజే.. రైతుబంధు నిధులు, పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ఈ కుబేర్ తో..  దాదాపు 54లక్షల మంది రైతుల ఖాతాల్లో డైరెక్ట్ గా రైతుబంధు డబ్బులు వేయనుంది సర్కార్.