
వానకాలం పంట పెట్టుబడి కింద రైతుబంధు నిధులను జూన్ 26 నుండి విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రైతులకు ఎప్పటిలాగే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని, ఇందుకోసం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావును, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం.. పట్టాలు పొందిన రైతులకు కూడా రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.