ఐదెకరాలలోపు రైతులకే రైతుబంధు ఇవ్వాలి

ఐదెకరాలలోపు రైతులకే రైతుబంధు ఇవ్వాలి
  • సీఎంవోకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లెటర్

హైదరాబాద్, వెలుగు: ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతు బంధు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. ఈ స్కీమ్ లో మార్పులు చేయాలంటూ గురువారం సీఎంవో ప్రిన్సినల్ సెక్రటరీకి ఆయన లెటర్ రాశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్​లో 59.21లక్షల మందికి ప్రభుత్వం రూ.15,233 కోట్లు ఇచ్చిందని, పెద్ద రైతులు వ్యవసాయం చేయకుండానే ఏడాదికి రూ.10 వేలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు భూములు ఉన్న రైతులు 53.54 లక్షల మంది ఉన్నారని, వీళ్లకు మాత్రమే రైతు బంధు ఇస్తే రూ. 5,111 కోట్లు ఖర్చు కాగా.. దాదాపు రూ.10  వేల కోట్లు ఆదా అవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్ లో 5 ఎకరాల లోపు వారికే ఆర్థిక సాయం అందిస్తోందని గుర్తుచేశారు. సాగు చేయనోళ్లకు, కౌలుకు ఇచ్చుకునే రైతులకు రైతు బంధు ఇవ్వొద్దని లేఖలో కోరారు. రాజకీయ పదవులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందే వాళ్లకూ రైతు బంధు ఇవ్వొద్దని పద్మానాభరెడ్డి సూచించారు.

For More News..

ఊహించని ఘటన ఎదురైతే ఎలా రియాక్ట్ కావాలి?

పేపర్ బాటిల్స్‌లో కూల్‌‌డ్రింక్స్‌‌

నర్సరీతో ఆ నలుగురు.. ఉద్యోగాలు పోవడంతో సొంత బిజినెస్