రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగాలి: భారత్

రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగాలి: భారత్

రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగాలని భారత్ మరోసారి ప్రకటించింది. మాస్కో పర్యటనలో ఉన్న విదేశాంగశాఖ మంత్రి జైశంకర్.. రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ యుద్ధప్రభావం ఇండియాపై ఉందని జైశంకర్ అన్నారు. కోవిడ్ మహమ్మారి, ఆర్థిక ఒత్తిళ్లు, వాణిజ్య ఇబ్బందులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయన్నారు.

ఉగ్రవాదం, వాతావరణ మార్పుల వంటి సవాళ్లు తమ ముందున్నాయని జైశంకర్ అన్నారు . భారత్, రష్యా మధ్య బలమైన సంబంధం కొనసాగుతోందన్నారు . పాశ్చాత్య దేశాలు రష్యాతో వాణిజ్య సంబంధం తెంచుకున్నా.. తాము చమురు కొనుగోలు చేస్తున్నామన్నారు . అంతర్జాతీయ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చర్చించామని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ప్రకటించారు.