విద్యాసంస్థలు రీఓపెన్, అధికారులు సిద్ధం కావాలి

విద్యాసంస్థలు రీఓపెన్, అధికారులు సిద్ధం కావాలి

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శకాలు రెడీ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలన్న సీఎం ఆదేశాలతో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. అధికారులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ఈ నెల 25 నాటికి సిద్ధం కావాలని సూచించారు. నైన్త్, టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతులను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఈ నెల 20లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కోరారు.

విద్యా సంస్థలు, సంక్షేమ హాస్టళ్లు.. గురుకుల పాఠశాలల్లోని పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. విద్యా సంస్థల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు బియ్యం, పప్పు ఇతర ఆహార ధాన్యాలను జిల్లా కలెక్టర్లు పంపిస్తారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు  అన్ని పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ నెల 19న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల యాజమాన్య కమిటీలతో సమావేశమవుతామన్నారు మంత్రి. 9,10, ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం క్యాలెండర్ ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

కల్తీ లిక్కర్ తాగి 12 మంది మృతి..మరో ఆరుగురి పరిస్థితి విషమం

..