చేవెళ్ల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. గురువారం చేవెళ్లలోని ఓ గార్డెన్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
బీఆర్ఎస్నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. డీసీఎంఎస్ చైర్మన్ పటోళ్ల కృష్ణారెడ్డి, పార్టీ చేవెళ్ల మాజీ ఇన్చార్జి దేశమోళ్ల ఆంజనేయులు, మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, నాయకులు హన్మంత్ రెడ్డి, శివప్రసాద్ తదితరులున్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి
వికారాబాద్: ఇటీవల ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. వికారాబాద్, మోమిన్‌పేట మండలాల్లో బీఆర్ఎస్మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను గురువారం సన్మానించారు. అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగొద్దని, ఇబ్బందులు ఎదురైతే తాము అండగా ఉంటామన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీసీ కమిషన్మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జడ్పీ మాజీ వైస్చైర్మన్విజయ్కుమార్, నాయకులు నర్సింహారెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.
