సాయంత్రం 5గంటలకు గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ

సాయంత్రం 5గంటలకు గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ

యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ కు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి సబిత, ఉన్నతాధికారులతో కలిసి బిల్లుకు సంబంధించి గవర్నర్కు ఉన్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసే అవకాశముంది. 

కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై సందేహాలున్నాయంటూ గవర్నర్ తమిళి సై రెండు రోజుల క్రితం ప్రభుత్వంతో పాటు యూజీసీకీ లేఖ రాశారు. తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు 2022  బిల్లుపై  చర్చించేందుకు రావాలని విద్యాశాఖ మంత్రికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ రాశారు. అయితే ఈ విషయమై నాలుగైదు రోజులుగా వివాదం సాగుతుంది. తమకు సమాచారం ఇవ్వలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అయితే సెప్టెంబర్లోనే మెసేంజర్ ద్వారా ఈ విషయమై సమాచారం పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి.