పదవికి న్యాయం చేస్తేనే ఉన్నత పదవులు..పీసీసీ ప్రధాన కార్యదర్శులతో సచిన్ సావంత్ భేటీ

పదవికి న్యాయం చేస్తేనే ఉన్నత పదవులు..పీసీసీ ప్రధాన కార్యదర్శులతో సచిన్ సావంత్ భేటీ
  •     పనితీరుపై ఆరా.. పని చేయని వారికి హెచ్చరికలు

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తేనే రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు వస్తాయని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ అన్నారు. బుధవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శులతో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. గత ఆరు నెలల్లో పార్టీ బలోపేతం కోసం ఏం చేశారో సచిన్ సావంత్ అడిగి తెలుసుకున్నారు. 

రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా ఆరా తీశారు. బాగా పనిచేసిన ప్రధాన కార్యదర్శులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన స్థాయిలో పనిచేయని వారికి పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. ఇప్పటికే గత రెండు రోజులుగా పీసీసీ ఉపాధ్యక్షులతో సచిన్ సావంత్ విడివిడిగా భేటీ అయ్యారు. పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేసేలా అందరూ పనిచేయాలని ఆయన సూచించారు.