మల్టీజోన్1, 2 లలో పలువురికి ఎంపీడీఓలుగా ప్రమోషన్లు

మల్టీజోన్1, 2 లలో పలువురికి ఎంపీడీఓలుగా ప్రమోషన్లు
  • పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న పలువురు అధికారులకు ఎంపీడీఓలుగా ప్రమోషన్లు లభించాయి. మల్టీజోన్-1, 2  పరిధిలోని సూపరింటెండెంట్లు (జెడ్పీ, ఎంపీపీ), ఎంపీఓలు (మండల పంచాయతీ అధికారులు), ఏఎస్‌‌‌‌ఓ (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్) కేడర్లలో పనిచేస్తున్న అధికారులను ఎంపీడీఓలుగా బదిలీ చేస్తూ,  పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రమోషన్ పొందిన అధికారులు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా కేటాయించిన జిల్లాల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. సంబంధిత జిల్లా కలెక్టర్లు,  జెడ్పీ సీఈఓలు వెంటనే ఈ అధికారులను రిలీవ్ చేసి, కేటాయించిన జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.