- రూ.3.6 కోట్లతో 2 శాతం వాటా
హైదరాబాద్, వెలుగు: సోలార్ ప్యానెల్స్ వంటి ప్రొడక్టులు తయారు చేసే హైదరాబాద్‌కు చెందిన ట్రూజన్ సోలార్ (సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్), క్రికెటర్సచిన్ టెండూల్కర్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా సచిన్ ఈ సంస్థలో రూ.3.6 కోట్లు పెట్టుబడి పెట్టి దాదాపు 2 శాతం వాటాను దక్కించుకున్నారు. 2030 నాటికి దేశంలోని టాప్–3 సోలార్ ఈపీసీ కంపెనీలలో ఒకటిగా నిలవడమే తమ లక్ష్యమని ట్రూజన్తెలిపింది.
ఈ పెట్టుబడితో కంపెనీ తన కార్యకలాపాలను జాతీయ స్థాయికి విస్తరించనుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బలంగా ఉన్న తమ సంస్థ, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కేరళ వంటి కొత్త మార్కెట్లలోకి వేగంగా ప్రవేశిస్తామని ఎండీ చారుగుండ్ల భవానీ సురేష్ తెలిపారు.
