నవంబర్ 5న హైదరాబాద్కు వస్తున్న సచిన్

నవంబర్ 5న  హైదరాబాద్కు వస్తున్న సచిన్

మాస్టర్ బ్లాస్టర్ సంచిన్ టెండూల్కర్ నవంబర్ 5న  హైదరాబాద్ రానున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో  ఎన్ఈబీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగే  మారథాన్ కు ముఖ్య అతిథిగా హాజరవుతారు.   జెండా ఊపి మారథాన్ ను  ప్రారంభించనున్నారు.

దాదాపు 8 వేల మంది  రన్నర్లు గచ్చిబౌలి స్టేడియంలో తెల్లవారుజామున జరిగే మారథాన్ లో పాల్గొననున్నారు.   ఈవెంట్ మూడు విభాగాలుగా జరుగుతుంది. ఉదయం 5:15 గంటలకు  హాఫ్ మారథాన్ 21.1కి.మీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 6:30 గంటలకు  10కె రన్.. ఉదయం 7:45 గంటలకు5 కె రన్ ప్రారంభమవుతుంది.

 దేశ వ్యాప్తంగా ఏజెస్ ఫెడరల్  ఇలాంటి  మారథాన్‌ల ద్వారా అందరికీ  మంచి  భవిష్యత్ ను  అందిస్తోందన్నారు ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండుల్కర్ .ఈ రన్   ఏజ్‌లెస్..  రన్ ఫియర్‌లెస్ అనే ధీమ్  అందరిలో అత్యుత్త మ ప్రయత్నాలను అందించడానికి  ప్రేరేపిస్తుందన్నారు.