
బుమ్రా భారత టెస్ట్ జట్టులో ఉంటే మన జట్టు గెలవడం కంటే ఎక్కువగా ఓడిపోతుంది. ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్ లోనే కాదు బుమ్రా కెరీర్ ప్రారంభం నుంచి ఈ బ్యాడ్ సెంటి మెంట్ కొనసాగుతూనే వస్తుంది. 2018లో బుమ్రా అరంగేట్రం చేసినప్పటి నుండి బుమ్రా ఆడని 28 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇండియా ఐదు మాత్రమే ఓడిపోయింది. 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. మరో మూడు డ్రాగా ముగిశాయి. దీంతో ఇప్పుడు బుమ్రాపై సరదాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతోంది. ఈ సమయంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్.. బుమ్రా గురించి తన ఆలోచనలను షేర్ చేసుకున్నాడు.
బుమ్రా గురించి సచిన్ మాట్లాడుతూ.. "జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు. బుమ్రా లేకుండా భారత జట్టు రెండు టెస్టులు గెలిచింది. జనాలు దీన్ని నెగటివ్ కోణంలో చూడకండి. నిజం చెప్పాలంటే ఇది కేవలం యాదృచ్చికం మాత్రమే". అని సచిన్ రెడ్డిట్ వీడియోలో అన్నారు. ఈ సందర్భంగా బుమ్రా ప్రదర్శన గురించి సచిన్ స్పందించాడు. "బుమ్రా చాలా బాగా ఆడాడు. మొదటి టెస్ట్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అతను రెండవ మ్యాచ్ ఆడలేదు. కానీ లార్డ్స్‌లో జరిగిన మరోసారి అతను 5 వికెట్లు పడగొట్టాడు. అతను ఆడిన 3 టెస్ట్‌లలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. చాలా క్వాలిటీ బౌలర్. నేను అతన్ని అగ్రస్థానంలో ఉంచుతాను". అని టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.
ALSO READ : Rishabh Pant: ఆర్ధిక ఇబ్బందుల్లో మెరిట్ స్టూడెంట్.. ఫీజ్ మొత్తం వెంటనే చెల్లించిన రిషబ్ పంత్
ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో బుమ్రా ఆడని మ్యాచ్ ల్లో భారత జట్టు టెస్టుల్లో అద్భుత విజయాలను సాధిస్తూ వచ్చింది. తాజాగా ఇంగ్లాండ్ తో ముగిసిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఇండియా 2-2 తో సిరీస్ సమం చేసింది. ఇండియా గెలిచిన రెండు టెస్టుల్లో బుమ్రా లేకపోవడం విశేషం. బుమ్రా ఆడిన మూడు టెస్టుల్లో రెండు మ్యాచ్ ల్లో ఓడిపోగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది. అంతకముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్ లాడితే టీమిండియా కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచింది.